చావు వెంటాడుతుందంటే ఇదేనేమో. భార్య సూసైడ్ చేసుకోవడంతో భయంతో వెయ్యి కిలోమీటర్లు దూరంగా పారిపోయాడు. కానీ.. చివరికి తను కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రెండ్ అవుతోంది. ఇంత విచిత్రంగా జరిగిన ఈ భార్యభర్తల చావుల వెనుక పెద్ద కారణమే ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తగా పెళ్లైన జంట.. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం బెంగళూరులో కలకలం రేపింది. భార్య ఆత్మహత్యతో భయపడి బెంగళూర్ నుంచి నాగ్ పూర్ వరకు.. అంటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి.. ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. శనివారం జరిగిన ఈ ఘటన రెండు నగరాల్లో సంచలనంగా మారింది.
మృతుడు సూరజ్ శివన్న (35) గా గుర్తించారు పోలీసులు. బెంగళూరులోని విద్యారణ్యపురి BEL లేయౌట్ లో ఉంటున్నారు. సూరజ్ శుక్రవారం రాత్రి నాగ్ పూర్ వార్ధా రోడ్డులోని హోటల్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. అతని తల్లి జయంతి శివన్న (60) కూడా ఆత్మహత్యకు పాల్పడగా తృటిలో ప్రాణాలతో బయటపడింది.
ఏం జరిగిందంటే..
బెంగళూరుకు చెందిన సూరజ్, గనవీ ఇద్దరూ నెల పదిహేను రోజుల క్రితం పెళ్లి చేసుకుని విద్యారణ్యపురిలో నివాసం ఉంటున్నారు. గురువారం (25) గనవీ ఆత్మహత్య చేసుకోగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కూతురు మృతికి కారణంగా అత్తింటి వారేనని.. వరకట్నం కోసం వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని స్టేషన్ ముందు ఆందోళన చేయడంతో కేసు చాలా సీరియస్ అయ్యింది.
►ALSO READ | న్యూ ఇయర్ కోసం ఎంత దాచార్రా బాబూ..? హైదరాబాద్లో మరోసారి రూ.13 లక్షల డ్రగ్స్ స్వాధీనం
కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించగా.. అరెస్టు చేస్తారనే భయంతో ఆమె భర్త సూరజ్, అతని తల్లి నాగ్ పూర్ కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బంధువుల నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్ తో.. ఒత్తిడి తట్టుకోలేక.. సూరజ్, అతని తల్లి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సూరజ్ చనిపోగా.. అతని తల్లి ప్రాణాలతో బయటపడింది .
బెంగళూరు టు హైదరాబాద్.. అటునుంచి నాగ్ పూర్:
నిందితులు అరెస్టు భయంతో ముందుగా హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత డిసెబంర్ 26న నాగ్ పూర్ కు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో సూరజ్ తమ్ముడు సంజయ్ కూడా వాళ్లతో పాటే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో సోనెగాన్ ఇన్ స్పెక్టర్ నితిన్ మగర్ చెప్పిన వివరాల ప్రకారం.. హోటల్ రూమ్ లో జరిగిన ఘటన గురించి హోటల్ స్టాఫ్ చెప్పిన వివరాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సూరజ్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం కు పంపించిన పోలీసులు.. మృతుని తల్లి, తమ్ముడు నుంచి స్టేట్ మెంట్ తీసుకుని కేసు నమోదు చేశారు.
