సిగాచీ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..14 రోజుల రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలింపు

సిగాచీ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..14 రోజుల రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలింపు

సంగారెడ్డి, వెలుగు: సిగాచీ పరిశ్రమ ఎండీ, సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పాశామైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో జూన్ 30న సిగాచీ పరిశ్రమ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో జరిగిన పేలుడులో 54 మంది కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే. 

అప్పట్లో ఈ ఫ్యాక్టరీ యాజమాన్యంపై భానూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో  కేసు నమోదు కాగా, ఆరు నెలల పాటు దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలో శనివారం రాత్రి పోలీసులు సిగాచీ ఫ్యాక్టరీ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది.