కిష్టారెడ్డిపేటలో హిందువుల నిరసనలు

కిష్టారెడ్డిపేటలో హిందువుల నిరసనలు

అమీన్​పూర్, వెలుగు: బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆదివారం అమీన్​పూర్​ పట్టణ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో హిందువులు నిరసనలు తెలిపారు. ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.  

బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, కారకులను శిక్షించాలని డిమాండ్​ చేశారు. చిన్నారులు సైతం ప్లకార్డులు చేతబట్టి  ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదెల్లి రవీందర్​, ఈర్లరాజు, మాణిక్​యాదవ్​, అంజిరెడ్డి, లక్ష్మణ్​, పెంటేశ్, రాజేందర్​గౌడ్, రాజ్​కుమార్, రాకేశ్, ప్రసాద్, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.