బాబోయ్ చిరుత.. మరిమడ్లలో గొర్ల మందపై చిరుత దాడి

బాబోయ్ చిరుత.. మరిమడ్లలో గొర్ల మందపై చిరుత దాడి
  • భయాందోళనలో గ్రామస్తులు 

కోనరావుపేట, వెలుగు : మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో చిరుత సంచారం మరువక ముందే మరిమడ్ల శివారులోని సింజాల్ అటవీ ప్రాంతంలో గొర్ల మందపై మరో చిరుత దాడి చేసి ఓ గొర్రెను ఎత్తుకెళ్లింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్లకాపరులు రోజుమాదిరిగానే తమ గొర్లను మేత కోసం అడవికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తొట్ల పరవురాములు గొర్ల మందపై చిరుత దాడి చేయడంతో కాపర్లు కేకలు వేశారు. దీంతో చిరుత గొర్రెను విడిచిపెట్టి పారిపోయింది. అటుగా వెళ్లి ముచ్చర్ల మహేందర్ గొర్ల మందపై దాడి చేసి గొర్రెను ఎత్తుకెళ్లింది. విషయం తెలుసుకున్న ఎఫ్ఎస్ వో ఆయుబ్ చిరుత దాడిలో గాయపడ్డ గొర్రెను పరిశీలించారు. అనంతరం అటవీ శివారు ప్రాంతంలో పర్యటించి చిరుత చిరుత పాదముద్రలను

గుర్తించారు. రైతులు, పశువులకాపర్లు అటవీ శివారు ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. చిరుత దాడితో గ్రామస్తులు, రైతులు, పశువులకాపరులు భయాందోళనకు గురవుతున్నారు. 
28VMD78; వట్టిమల్ల గొల్లపల్లి అటవీ శివారులో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన చిరుత పాదముద్రలు28VMD79; కుమ్మరి దిలీప్ దిలీప్ కుమార్ 9704437535