కామారెడ్డి, వెలుగు: పర్మిషనల్ లేకుండా న్యూ ఇయర్ వేడుకలు నిషేధమని, ఫామ్‌హౌజ్ లు, క్లబులు, గేటెడ్ కమ్యూనిటీల్లో పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ డీజేలు, పటాకులు కాల్చటం నిషేధమన్నారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమన్నారు. మద్యం మత్తులో వెహికల్స్ నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిగా అలర్ట్‌గా ఉండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. మత్తు పదార్థాల అమ్మకం, వినియోగానికి పాల్పడితే నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
