హార్మూజ్ జలసంధి రక్షణకు దౌత్యమే మార్గం..ట్రంప్ పిలుపును తిరస్కరించిన చైనా

హార్మూజ్ జలసంధి రక్షణకు దౌత్యమే మార్గం..ట్రంప్ పిలుపును తిరస్కరించిన చైనా

బీజింగ్: హార్మూజ్ జలసంధిని రక్షించేందుకు అంతర్జాతీయ సైనిక కూటమిలో చేరాలని, యుద్ధనౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపును చైనా సున్నితంగా తోసిపుచ్చింది. హార్మూజ్ జలసంధి రక్షణకు దౌత్యమే మార్గమని.. వెంటనే ఇరాన్​పై సైనిక చర్యలను నిలిపివేయాలని అమెరికా, ఇజ్రాయెల్​కు తేల్చి చెప్పింది. సోమవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మీడియాతో మాట్లాడారు. "హార్మూజ్ జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యంతోపాటు ఇంధన సరఫరాపై ప్రతికూల ప్రభావం 
చూపుతున్నాయి" అని పేర్కొన్నారు.