మేళ్లచెరువు, వెలుగు: బ్రాహ్మణులను, హిందూ ధర్మాన్ని కించపరిచేలా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కామెంట్లు చేశాడని , తక్షణమే ఆయన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో కస్తూరి వెంకటేశ్వర శర్మ కల్యాణ మండపంలో ఉగాది పంచాంగం ఆవిష్కరణ జరిగింది.
అనంతరం సామెల్ వ్యాఖ్యలపై స్థానిక తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన, నిరసనలు చేశారు. క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట, జిల్లా అధ్యక్షుడు ఫణి కుమార్ శర్మ, కొంకపాక రాధాకృష్ణ మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవశర్మ, రామలింగేశ్వర శర్మ పాల్గొన్నారు.
