బాన్సువాడ, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అవర్చుకోవాలని రాష్ర్ట వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి బాన్సువాడలో నిర్వహించిన 39వ సామూహిక మండల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని, ప్రతి ఏడాది అయ్యప్ప మహా మండల పూజలో పాల్గొంటానన్నారు.
కార్యక్రమంలో గురుస్వాములు శంకర్, వినయ్, సాయి ప్రసాద్, మల్లికార్జున్, రాజు, వీరప్ప, ముదిరెడ్డి విట్టల్ రెడ్డి, ర్యాల విట్టల్ రెడ్డి, నిర్వాహకులు, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, సరస్వతీ ఆలయ ధర్మకర్త శంబురెడ్డి, బాన్సువాడ సహకార పరపతి సంఘం చైర్మన్ ఎరువల కృష్ణారెడ్డి, వివిధ మండలాల నుంచి వచ్చిన గురుస్వాములు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
