ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉపాధి హామీకి గాంధీ పేరు తొలగింపుపై నిరసన

ఉమ్మడి నిజామాబాద్  జిల్లాల్లో ఉపాధి హామీకి గాంధీ పేరు తొలగింపుపై నిరసన
  • ఉమ్మడి జిల్లాల్లో గాంధీ విగ్రహాల వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు 

కోటగిరి, వర్ని, కామారెడ్డి టౌన్, ఎల్లారెడ్డి, వర్ని, ఎడపల్లి, ఆర్మూర్/ వెలుగు:  ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు రాస్తారోకో చేపట్టారు.  నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. కోటగిరి, పోతంగల్, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, పుప్పాల శంకర్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ లో గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నాయకులు  తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కులో మహత్మాగాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.  

వర్ని మండల కేంద్రంలో వర్ని మార్కెట్​ కమిటీ చైర్మన్​సురేశ్​బాబా, పీసీసీ డెలిగేట్​ కూనిపూర్​రాజిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఆర్మూర్​లో కాంగ్రెస్ ​పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు కూర్చుని ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఆర్మూర్​కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌ చార్జి ప్రొద్దుటూరి వినయ్​ కుమార్​రెడ్డి మాట్లాడుతూ..  కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుందని చెప్పేందుకు ఇదే కారణమన్నారు.  కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి  ఉపాధిహామీ స్కీమ్​ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

నిరసన కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్​రెడ్డి, మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు, టౌన్​ ప్రెసిడెంట్​రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు బుర్రనారాగౌడ్​ మాట్లాడుతూ..  దేశంలోని పేద ప్రజలకు వరంగా మారిన జాతీయ గ్రామీణ ఉపాదిహామీ పథకంపేరులో మహాత్మాగాంధీ పేరును తొలగించడం దారుణమన్నారు.