లింగంపేట, వెలుగు: కరీంనగర్‌లోని పారమిత హైస్కూల్లో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో పీఎంశ్రీ జడ్పీ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ఆదివారం ఎంఈవో షౌకత్‌అలీ తెలిపారు.
పాఠశాలకు చెందిన పోతరాజు, ప్రతి గౌడ్, భానుప్రసాద్ రాష్ట్ర స్థాయి క్విజ్‌పోటీల్లో రెండో స్థానంలో నిలిచారని చెప్పారు. ఓవరాల్ కాంపిటీషన్స్‌లో రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. సాయంత్రం ప్రతిభ కనబరిచిన స్కూల్ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీచర్లు వహిద్సిద్దిఖీ, తదితరులు పాల్గొన్నారు.
