సూర్యాపేట, వెలుగు: జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పార్టీ పతకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ, నెహ్రూ కలయిక ఈ దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామన్నారు.
నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలోని శివాజీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఎగురవేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేత మాట్లాడుతూ.. దేశానికి బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కల్పించి, స్వాతంత్రం సాధించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన కొనియాడారు.
కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు, ఎండీ ముంతాజ్ అలీ, బోడ స్వామి, నూనె కోటి, జిల్లా పరమేశ్, సుధాకర్ ముదిరాజ్, పుట్ట వెంకన్న, రాంబాబు నాయుడు, రవితేజ బాలకృష్ణ నేత, రఫీ, శివ, బ్రహ్మచారి, టి. యాదగిరి, మహేశ్ కురుమ, కోటేష్ , సంతోష్ ,సాయి సాయితేజ, దశరథ,శరత్, సాయి, లక్ష్మణ్ , ఉమేష్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పేదల పక్షం
యాదాద్రి, వెలుగు: పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పాటు పడుతోందని డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేరు కాంగ్రెస్ ఆఫీసులో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నాడు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకూ దేశ ప్రజల కోసం పాటు పడుతున్నారని తెలిపారు.
తిరుమలగిరిలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
తుంగతుర్తి, వెలుగు: భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్ 141 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను తీర్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేశ్, చామంతి, జనార్ధన్, గంగరాజు ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
