కరీంనగర్ సిటీలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్

కరీంనగర్ సిటీలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్

కరీంనగర్ టౌన్, వెలుగు : సిటీలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో సన్ షైన్ హాస్పిటల్, ఆదరణ సేవా సమితి(ఎన్ జీవో) ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్ షైన్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ టి.సురేశ్ కుమార్, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ జోనల్ ఇన్​చార్జి శశిధర్  మాట్లాడుతూ బీఎంఐ, హెబీ, బీపీ, జీఆర్ బీఎస్, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. 

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదరణ సేవా సమితి సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో  డాక్టర్ దివ్యరెడ్డి, డాక్టర్ నిఖిలరెడ్డి, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ అంజుమ్, ఎస్సార్ ప్రైమ్ స్కూల్ హెచ్ఎం కొండనాగప్రణవి, ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని, రవి తదితరులు పాల్గొన్నారు.