- ప్రముఖ చరిత్రకారులు నిర్ధారణ
వేములవాడ, వెలుగు : పట్టణంలోని ప్రధాన రహదారిలో సైడ్ మురుగు కాలువ నిర్మాణం కోసం ఈనెల 26న తవ్వుతుండగా పురాతన రాతి విగ్రహం బయటపడింది. ఇది పంచ పరమేష్టి జైన తీర్థంకరుడి విగ్రహమని ప్రముఖ చరిత్రకారులు, కొత్త తెలంగాణ చరిత్ర సారథి రామోజు హరగోపాల్ పేర్కొన్నారని స్థానిక చరిత్రకారుడు సంకెపల్లి నాగేంద్రశర్మ ఆదివారం తెలిపారు.
ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలను హరగోపాల్‌కు పంపించగా, వాటిని పరిశీలించిన అనంతరం ఒకేరాతిపై అయిదు జైన తీర్థంకరుల విగ్రహాలుండటం అరుదైన విషయమని చెప్పినట్లు వివరించారు. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాన్ని వేణుగోపాలస్వామి ఆలయంలో భద్రపరిచినట్లు తెలిపారు. స్థానిక భీమేశ్వరాలయంలో ఇలాంటి జైన తీర్థంకరుడి విగహాన్ని పునాది ప్యానెలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
