సుల్తానాబాద్, వెలుగు : సర్కార్ స్కూల్స్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలను తెరిపించామన్నారు.
గడిచిన రెండేండ్లలో స్కూల్స్ లో మంచి ఫలితాలు తీసుకొచ్చామని తెలిపారు. సుల్తానాబాద్ లోని జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు సొంత భవనం కోసం ప్రభుత్వ భూమి కేటాయించనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రావు, రమేశ్, అంజిరెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన నీరుకుళ్ల సర్పంచ్..
సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో ఇండిపెండెంట్ గా గెలిచిన సర్పంచ్ కాంపల్లి సతీశ్ కుమార్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నేత పొన్నం చంద్రయ్యగౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ తోపాటు వార్డు సభ్యులు ముత్యం జోషిలా, భూంరావు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్కండువా కప్పి ఆహ్వానించారు.
