ఉమ్మడి కరీంనగర్జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

ఉమ్మడి కరీంనగర్జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
  • కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యం

 వెలుగు నెట్​వర్క్​ : ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్​ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్​కట్​చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. మొదటిసారి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ గొప్ప దార్శనికతతో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి  ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపించి, ఆహార భద్రతకు సంబంధించి ఎన్నో ఆవిష్కరణలు చేశారని తెలిపారు.

 దేశంలో ఎన్నో పెద్ద ప్రాజెక్టులు స్థాపించడం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమైందని తెలిపారు. మహాత్మాగాంధీ, జవహర్​లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటంతో స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిపారు. ఆయా వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.