ఇంట్లోనే బక్రీద్‌ ప్రార్దనలు చేసుకోవాలి: మహమూద్ అలీ

ఇంట్లోనే బక్రీద్‌ ప్రార్దనలు చేసుకోవాలి: మహమూద్ అలీ

బక్రీద్‌ పండగను పురస్కరించుకుని మంత్రి మహమూద్‌ అలీ GHMC అధికారులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రత్యేక శ్రద్ద వహించి పండగ జరుపుకోవాలని సూచించారు. ప్రార్దనలు ఇంట్లోనే చేయాలని, అక్కడ కూడా భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లను ధరించాలఅన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. పండగ సందర్భంగా బలి ఇచ్చే జంతువుల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు జీహెచ్‌ఎంసి అధికారులు ఏర్పాట్లుచేశారని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను… అదనపు సిబ్బందిని నియమించామని  GHMC అధికారులు హోం మంత్రికి వివరించారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండటంతో వ్యర్థాలను తొలగించే ప్రక్రియలో GHMC సిబ్బందికి ముస్లిం సోదరులు సహకరించాలని అధికారులు అన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బక్రీద్‌ పండగ జరుగనుంది.