మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్

మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
  •     ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు 

ఎల్ బీ నగర్, వెలుగు: పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఇంటిపై ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రెయిడ్ చేశారు. ఆదివారం ఆయన ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్ లోని మధుయాష్కీ గౌడ్ ఇంట్లో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదు రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే అక్కడేం దొరక్కపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. దీనిపై మధుయాష్కీ స్పందిస్తూ.. బీజేపీ అభ్యర్థి ఫిర్యాదుతోనే అధికారులు ఈ తనిఖీలు చేపట్టారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, అందుకే బీజేపీ ఇలాంటి పనులు చేస్తున్నదని మండిపడ్డారు.