బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ : వెంకయ్య నాయుడు

 బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ : వెంకయ్య నాయుడు

బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. రాజకీయ నాయకుల పట్ల ప్రజలలో గౌరవం, విశ్వాసం తగ్గుతోందన్న ఆయన.. ప్రజా సమస్యల పట్ల చర్చ జరగాల్సిన చట్టసభలు యుద్ధ భూములుగా మారుతున్నాయని ఆరోపించారు. ఇంగ్లీషు బాష నేర్చుకోవాలి తప్పు కాదు.. కానీ ఆంగ్ల సాంస్కృతులు మాత్రం నేర్చుకోవద్దని హితవు పలికారు. పరభాష వ్యామోహంలో మాతృ భాష, సాంస్కృతిని మర్చిపోవద్దని వెంకయ్య చెప్పారు. -మాతృభాషలో ప్రాథమిక విద్య, పరిపాలన ఉండాలని ఆకాంక్షించారు. 

జిల్లా కలెక్టర్లు ఎవరైనా సరే తెలుగులోనే మాట్లాడాలని కోరారు. కులమతాల పేరుతో కొన్ని రాజకీయ శక్తులు మనుషుల మధ్య ద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయన్న వెంకయ్య.. విద్య వ్యాపారం కాకూడదని తెలిపారు. పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యాసంస్థలు సహకరించాలన్నారు. సమాజంతో సంబంధం లేకుండా కేవలం నాలుగు గోడల మద్యే విద్యను నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం.. సమాజంతో జర్నీ చేయక పోవడమేనని, సెల్ ఫోన్ కు బానిసలై సమయాన్ని వృథా చేస్తున్నారని స్పష్టం చేశారు.