V6 News

సెక్రటేరియట్ ముట్టడికి యత్నం: బీజేపీ నేతల అరెస్ట్

సెక్రటేరియట్ ముట్టడికి యత్నం: బీజేపీ నేతల అరెస్ట్

ఇంటర్ ఫలితాల్లో తప్పులు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ చేపట్టిన బంద్ హైదరాబాద్  లో ఉద్రిక్తతకు దారీ తీసింది. సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం గేటు వద్ద భైఠాయించిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.