V6 News

అంబానీ ఇంట్లో 7 స్టార్ హోటల్ కిచెన్.. యాంటిలియాలో చెఫ్ జీతం ఎన్ని లక్షలంటే..?

అంబానీ ఇంట్లో 7 స్టార్ హోటల్ కిచెన్.. యాంటిలియాలో చెఫ్ జీతం ఎన్ని లక్షలంటే..?

ముకేశ్ అంబానీ ముంబై నివాసం యాంటిలియా ఒక అధునాతన రాజప్రాసాదం. ఇక్కడ వంటగది ఒక 7-స్టార్ హోటల్ ఆపరేషన్‌ను తలపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఉండే ఈ ఇంట్లో రోజూ జరిగే వంటా వార్పుల గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

యాంటిలియాలో ప్రతిరోజూ సుమారు 4వేల రోటీలు తయారు చేస్తారు. ఇది వినడానికి వింతగా అనిపించినా.. అక్కడ పనిచేసే సుమారు 600 మంది సిబ్బంది కోసం ఈ స్థాయిలో భోజనాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, డ్రైవర్లు, టెక్నికల్ టీమ్ ఇలా అందరికీ మూడు పూటలా రుచికరమైన భోజనం అందించడం ఒక పెద్ద మిషన్ లాంటిది. ఇందుకోసం అత్యాధునిక చపాతీ మేకింగ్ మెషీన్లను కూడా ఉపయోగిస్తారు.

లక్షల్లో జీతం.. 
ఈ వంటగదిని పర్యవేక్షించే మెయిన్ చెఫ్ ఏడాది వేతనం అక్షరాలా రూ.24 లక్షలు అని సమాచారం. అంటే నెలకు రూ. 2 లక్షల పైమాటే. దేశంలోని సగటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నెల సంపాదన కంటే ఇది చాలా ఎక్కువ. అయితే ఇది కేవలం వంట చేయడం మాత్రమే కాదు.. వందల మందికి నాణ్యత తగ్గకుండా, పరిశుభ్రత పాటిస్తూ, సమయానికి భోజనం అందించే హై-ప్రెజర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగం.

సింపుల్ డైట్.. లోకల్ ఫుడ్
కోట్లు ఉన్నా అంబానీ కుటుంబం తీసుకునే ఆహారం మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ముకేశ్ అంబానీ ఉదయాన్నే బొప్పాయి జ్యూస్, ఇడ్లీ-సాంబార్‌ను ఇష్టపడతారట. ఇక నీతా అంబానీ హెల్త్ డైట్‌కు ప్రాధాన్యత ఇస్తారు. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, జ్యూస్‌లు ఆమె మెనూలో ఉంటాయి. మధ్యాహ్నం భోజనంలో పప్పు, అన్నం, రోటీ, సబ్జీ వంటి ఇంటి భోజనాన్నే అంబానీ ఫ్యామిలీ ఇష్టపడుతుందట. రాత్రి వేళల్లో రాగులు లేదా జొన్న రొట్టెలు, సూప్స్ వంటి తేలికపాటి ఆహారం తీసుకుంటారు.

నెలకోసారి జంక్ ఫుడ్..
అంబానీ కుటుంబానికి గుజరాతీ స్టైల్ పప్పు అంటే చాలా ఇష్టమని సమాచారం. వీరు జంక్ ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. అయితే నెలకు ఒక్కసారి మాత్రమే టీచ్ డే ఉంటుంది. అయితే ముకేశ్ అంబానీకి సేవ్ పూరి అంటే ప్రాణం. యాంటిలియా వంటి విలాసవంతమైన ఇంట్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నా.. వారి ఆహారపు అలవాట్లు సగటు భారతీయ కుటుంబం మాదిరిగానే ఉండటం గమనార్హం. ఖరీదైన వంటగదిలో సామాన్యమైన రుచులు అంబానీ కుటుంబానికి అసలైన తృప్తినిస్తాయి.