నేడు (నవంబర్15) ‘జైన’ దీక్ష తీసుకోనున్న సంజన

నేడు (నవంబర్15) ‘జైన’ దీక్ష తీసుకోనున్న సంజన
  • ముందురోజు 3 వేల మంది జైన భక్తులతో శోభాయాత్ర
  • వర్షీదాన్‌‌‌‌‌‌‌‌లో ఆస్తులు, విలువైన వస్తువుల దానం

అబిడ్స్, వెలుగు: విలాసవంతమైన జీవితం, మంచి ఉద్యోగం, సొంత వ్యాపారం.. అన్నీ ఉన్నా ఆ యువతి మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లింది. భౌతిక సుఖాలను పూర్తిగా త్యజించి, మోక్ష మార్గమే లక్ష్యంగా 25 ఏళ్ల సంజన లునావత్ జైన భగవతి దీక్ష స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఈ యువతి ఎంబీఏ పూర్తి చేసి, ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ డిజైనింగ్‌‌‌‌‌‌‌‌లో రాణించడంతో పాటు సొంతంగా బొటిక్‌‌‌‌‌‌‌‌ కూడా నడిపారు.

 కానీ, 12 ఏళ్ల వయసు నుంచే జైన ధర్మం పట్ల ఏర్పడిన ఆసక్తితో ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మహా దీక్షకు ముందు శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. నాంపల్లి లలిత కళాతోరణం నుంచి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ వరకు సాగిన ఈ ఊరేగింపులో 3 వేల మందికి పైగా జైన భక్తులు పాల్గొన్నారు.

 పాతకాలపు కార్లు, గుర్రాలు, సంప్రదాయ వాయిద్యాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకలో భాగంగా వర్షీదాన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి తన ఆస్తులు, నగదును దానం చేశారు. ఆదివారం పూజ్య ఆచార్య శ్రీ జ్ఞానచంద్రజీ మహరాజ్ సాహెబ్ మార్గదర్శకత్వంలో దీక్షా మహోత్సవం జరగనుంది