కొత్త మందులొస్తున్నాయ్.. ఇన్హేలర్లు, పెప్టైడ్ మందులపై దృష్టి పెట్టిన టాప్ ఫార్మా కంపెనీలు

కొత్త మందులొస్తున్నాయ్.. ఇన్హేలర్లు, పెప్టైడ్ మందులపై దృష్టి పెట్టిన టాప్ ఫార్మా కంపెనీలు
  •  రెండు శ్వాసకోశ మందులను లాంచ్ చేయనున్న సిప్లా
  •  వెయిట్ లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం జెనరిక్ సెమాగ్లుటైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురానున్న డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  క్యాన్సర్ మందు అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాక్సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టిన సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మా
  •  అమెరికా మార్కెటే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..


హైదరాబాద్, వెలుగు: టాప్  ఫార్మా కంపెనీలు కొత్త మందులు తీసుకురావడంపై దృష్టి పెట్టాయి. రెవెన్యూ పెంచుకోవడానికి తమ పనులను ముమ్మరం చేశాయి.  సిప్లా, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్, సన్ ఫార్మా వంటి పెద్ద సంస్థలు  శ్వాసకోశ సంబంధిత మందులు (ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హేలర్లు), పెప్టైడ్,  ప్రత్యేక చికిత్స మందులను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. అయితే, అమెరికా రెగ్యులేటరీ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ  అనుమతులు ఆలస్యం అయినా, సరఫరా సమస్యలు తలెత్తినా ఈ కంపెనీల వృద్ధి అంచనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఏ కంపెనీ వ్యూహం ఎలా ఉందంటే?

సిప్లా: ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అమెరికా మార్కెట్ ద్వారా 172 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,630 కోట్ల) ఆదాయం పొందిన సిప్లా, 2026–-27 ఆర్థిక సంవత్సరం నాలుగో  క్వార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జనవరి–మార్చి) నాటికి దీనిని 250 మిలియన్ డాలర్ల (రూ.2,375 కోట్ల) కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆస్తమా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హేలర్లు అయిన వెంటోలిన్, అడ్వైర్ జెనరిక్ వెర్షన్ల అమ్మకాలతో పాటు మరో రెండు శ్వాసకోశ మందులు, ఒక పెప్టైడ్​ను  విడుదల చేయనుంది. పెప్టైడ్ మందులను డయాబెటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎముకల బలహీనత, క్యాన్సర్ చికిత్స, గుండె వ్యాధుల చికిత్సల్లో వాడతారు. 
    
డాక్టర్ రెడ్డీస్ : డయాబెటిస్, బరువు తగ్గించే  మందుల విభాగంలో విస్తరించేందుకు 'జెనరిక్ సెమాగ్లుటైడ్' తో పాటు 'అబాటాసెప్ట్' (రోగనిరోధక వ్యాధుల మందు) పై  కంపెనీ దృష్టి పెట్టింది. 10 దేశాల్లో సెమాగ్లుటైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతులు వచ్చినా, ముడిసరుకు  ఉత్పత్తి సమస్యల వల్ల సరఫరా ఆలస్యమైంది. ఆ సమస్య పరిష్కారమైందని, నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఈ మందును విడుదల చేస్తామని సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలీ తెలిపారు.
    
సన్ ఫార్మా: తీవ్రమైన జుట్టు రాలడాన్ని అరికట్టే 'లెక్సెల్వి' , క్యాన్సర్ ఔషధం 'అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాక్సిట్'  వంటి ప్రత్యేక మందులపై ఆశలు పెట్టుకుంది. సోరియాసిస్ చికిత్సకు వాడే 'ఇలుమ్యా' మందును నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికాలో విడుదల చేస్తోంది. అలాగే భారత్, దక్షిణాఫ్రికాల్లో జెనరిక్ సెమాగ్లుటైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే లాంచ్ చేసింది.
    
గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్: అమెరికా మార్కెట్లో శ్వాసకోశ మందులతో కంపెనీ విస్తరిస్తోంది. ఆస్తమాకు వాడే 'ఫ్లోవెంట్ 44' జెనరిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హేలర్ ఇప్పటికే అమెరికాలో 22శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. అలెర్జీలకు వాడే 'రియాల్ట్రిస్'  నాసల్ స్ప్రే ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 140 మిలియన్ డాలర్ల అమ్మకాలను ఆశిస్తోంది.
 
సవాళ్లు ఉన్నాయ్​.. 

కొన్ని మందులపైనే ఆధారపడటం ఫార్మా రంగంలో సహజమేనని, పాత మందుల అమ్మకాలు తగ్గినప్పుడు కొత్తవి ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే, యూఎస్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ తనిఖీల్లో ఉత్పత్తి కేంద్రాల్లో ఏవైనా లోపాలు బయటపడినా, అనుమతులు ఆలస్యమైనా ఈ కంపెనీల ఆదాయ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్లాంట్ల పనితీరుపై గతంలోనే ఎఫ్​డీయే అసంతృప్తి వ్యక్తం చేసింది.