V6 News

నటి దివ్యాంక శిరోహికి హార్ట్ అటాక్.. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణం పోయింది !

నటి దివ్యాంక శిరోహికి హార్ట్ అటాక్.. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణం పోయింది !

హర్యానా నటి దివ్యాంక శిరోహి 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్తో చనిపోయింది. మంగళవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఆమె ఇంట్లో గుండెపోటుకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. హర్యానా చిత్ర పరిశ్రమకు చెందిన నటులు దివ్యాంక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

దివ్యాంక స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమె గాయకుడు మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్ కూడా చేసింది. దివ్యాంకకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె కుటుంబంతో కలిసి ఘజియాబాద్‌లో ఉంటోంది. దివ్యాంక సిరోహి 1996 నవంబర్ 19న బులంద్‌షహర్‌లో పుట్టింది. ఆమె మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ పట్టా పొందింది. ఆ తర్వాత, ఆమె సిక్కింలో ఎంబీఏ చేసింది. దివ్యాంకకు హిమాంశు అనే సోదరుడు, దీపాంశు, జస్మీత్ అనే సోదరీమణులు ఉన్నారు.

ఆమె ప్రస్తుతం తన తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి ఘజియాబాద్‌లో ఉంటుంది. టిక్‌టాక్‌లో దీపావళి సమయంలో పంజాబీ గాయని సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే పాటకు దివ్యాంక నీలిరంగు సూట్ ధరించి హావభావాలు పలికించింది. ఈ వీడియో వైరల్ అయింది. 

ALSO READ : ఓటు వేసేందుకే.. విదేశాల నుంచి వచ్చిన హీరో అజిత్ కుమార్

ఆ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత టిక్‌టాక్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయిపోయాక ఆమె ఇన్ స్టాగ్రాం బాట పట్టింది. ఇన్స్టాగ్రాంలో కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే దివ్యాంక ఇలా గుండెపోటుతో చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.