హరీష్ గౌడ్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్బ్రాంతి

హరీష్ గౌడ్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్బ్రాంతి

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగి హరీష్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుండి ఉద్యోగం తొలగించడంతో మనస్తాపానికి గురై కేశవపట్నం మండలం అమ్మలపురం గ్రామానికి చెందిన హరీష్ గౌడ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హరీష్ మృతిపై బండి సంజయ్ స్పందించారు. మృతుడి కుటుంబానికి తక్షణమే నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని కోరారు. 

హరీష్ ఆత్మహత్యకు కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాల్లో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. దీనిపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.