V6 News

పరిగి టౌన్లో విషాద ఘటన.. కారును సడన్గా యూటర్న్ చేయడంతో..

పరిగి టౌన్లో విషాద ఘటన.. కారును సడన్గా యూటర్న్ చేయడంతో..

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పల్లవి కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్ను గమనించకుండా, ఒక కారు అకస్మాత్తుగా టర్న్ చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కారు బలంగా ఢీకొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి ఎగిరి కిందపడగా.. తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని పూడూర్ మండలం సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ నిండు ప్రాణం బలయ్యిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి.