జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో సెమీస్‎కు చేరిన సింధు

జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో సెమీస్‎కు చేరిన సింధు

టోక్యో: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరగాల్సిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మాజీ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నొజోమి ఒకుహర (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చివరి నిమిషంలో తప్పుకోవడంతో సింధుకు వాకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం లభించింది. దాంతో దాదాపు మూడేళ్ల తర్వాత సింధు ఒక సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరింది. 

2019 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన సింధు 2023 డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరడం ఇదే తొలిసారి. అలాగే మలేషియా ఓపెన్ సూపర్–1000, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీల తర్వాత ఈ ఏడాది ఆమె సెమీఫైనల్ చేరడం ఇది మూడోసారి కావడం విశేషం. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింధు.. చెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుఫై (చైనా)తో తలపడనుంది. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–10, 21–12తో సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యు జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియా)పై గెలిచింది.