చెన్నై గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో అర్జున్‌ రెండో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా

 చెన్నై గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో అర్జున్‌ రెండో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి చెన్నై గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. నొడిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో జరిగిన ఈ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 43 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. మరో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీరెజా ఫిరౌజా 69 ఎత్తుల వద్ద వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించాడు. రెండు విజయాలతో ఫిరౌజా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.

రష్యా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిమిత్రి ఆండ్రికిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రాణేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. నీహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... హాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా) మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 132 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఎంజీడీ–1 సంస్థ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 8 మంది ఆటగాళ్లు డబుల్ రౌండ్ -రాబిన్ పద్ధతిలో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడతారు. మొత్తం రూ. 75 లక్షల ప్రైజ్ మనీతో పాటు విలువైన 'ఫిడే సర్క్యూట్' పాయింట్లు కూడా లభించనున్నాయి.