ప్రావిడెన్స్: బౌలింగ్‌లో జైడెన్ లెనాక్స్ (4/52), మిచెల్ శాంట్నర్ (2/15), మైకేల్ బ్రేస్‌వెల్ (2/33) చెలరేగడంతో.. గురువారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2–1 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడిన విండీస్ 37.1 ఓవర్లలో 140 రన్స్‌కే ఆలౌటైంది. కేసీ కార్టీ (48) టాప్ స్కోరర్.
అకిమ్ అగస్టీ (26), హెట్‌మయర్ (26) ఫర్వాలేదనిపించారు. ఓ దశలో 63/0 స్కోరుతో ఉన్న విండీస్ ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో 141/4 స్కోరు చేసింది. టామ్ లాథమ్ (31 నాటౌట్), డారిల్ మిచెల్ (28), హెన్రీ నికోల్స్ (24), విల్ యంగ్ (23), డీన్ ఫాక్స్ క్రాఫ్ట్ (22 నాటౌట్) మెరుగ్గా ఆడారు.
