హైదరాబాద్, వెలుగు: ఇండ్ల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్లో ఈ ఏడాది జూన్వరకు ఐదు శాతం పెరిగాయని రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ నైట్ఫ్రాంక్తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం.. జనవరి– జూన్ మధ్య రూ.26,400 కోట్ల విలువైన 37,992 ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. గత నెల 5,560 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 13 శాతం తక్కువ. గత నెల ఐదున గైడెన్స్ విలువలు మారడంతో మే నెలలోనే ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి.
అందుకే జూన్‌లో ఈ తగ్గుదల కనిపించింది. రూ. కోటి పైబడిన ప్రీమియం ఇళ్లు జూన్ రిజిస్ట్రేషన్లలో 22 శాతం వాటా దక్కించుకున్నాయి. మొత్తం లావాదేవీల విలువలో వీటి వాటా 52 శాతంగా ఉంది. రంగారెడ్డి జిల్లా 49 శాతం వాటాతో మొదటిస్థానంలో నిలవగా, మేడ్చల్ మల్కాజిగిరి 38 శాతం, హైదరాబాద్ 13 శాతం వాటాలు సాధించాయని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ తెలిపింది.
