హాలియా: ఏపీఆర్డీసీ కాలేజీకి 4 లక్షల విలువైన సిమెంట్ రేకులు..ఉదారత చాటుకున్న విశాక ఇండస్ట్రీస్

హాలియా: ఏపీఆర్డీసీ కాలేజీకి  4 లక్షల విలువైన సిమెంట్ రేకులు..ఉదారత చాటుకున్న విశాక ఇండస్ట్రీస్

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల ద్వారా నాగార్జునసాగర్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ(ఏపీఆర్డీసీ)కి అండగా నిలిచింది. సుమారు రూ.4 లక్షల విలువ చేసే 700 సిమెంట్ రేకులను కళాశాల యాజమాన్యానికి ఉచితంగా అందజేసింది. 

కళాశాల పూర్వ విద్యార్థుల సెక్రటరీ ఏ.వి. రమణ కుమార్ చొరవతో ఈ రేకులను ప్రిన్సిపల్ డాక్టర్ జి. వెంకటరామిరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. హాస్టల్ గదులపై పాడైన రేకుల స్థానంలో కొత్తవి అమర్చుతామని వెల్లడించారు. కళాశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్న విశాక ఇండస్ట్రీస్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్న సంస్థను కళాశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు అభినందించారు.