తుంగతుర్తి మండల అధ్యక్షుల నియామక వివాదం: జగ్గారెడ్డితో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తుంగతుర్తి మండల అధ్యక్షుల నియామక వివాదం: జగ్గారెడ్డితో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తుంగతుర్తి వివాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు, తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ అంతర్గత సమస్యలపై చర్చించారు.  శుక్రవారం (జులై 17) జరిగిన ఈ భేటీలో మంత్రి ఉత్తం కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తన సొంత గ్రామం ఉందని అన్నారు. తన  ద్వారా 15 వేల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడతాయని తెలిపారు. 

అంతే కాకుండా NGOS ద్వారా గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తు చేశారు. మండల అధ్యక్షుల వ్యవహారం అనేది తమ పరిధిలోకి రాదని ఈ సందర్భంగా చెప్పారు. అందరితో సమన్వయం చేసుకొని పీసీసీ  అబ్జర్వర్ గా జగ్గారెడ్డి వివాదాన్ని పరిష్కరిస్తారని నమ్మకం ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారు. 

తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకంలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. 9 మండలాధ్యక్షుల నియామకంలో మూడు మండలాల విషయంలో వివాదం తలెత్తింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ అంశంపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ తో భేటీ అయ్యారు. అందరు నేతల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక పంపడంతో పాటు సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని జగ్గారెడ్డి అన్నారు.