అర్జెంటీనాకు ఆ రిఫరీ అంటేనే దడ.. వరల్డ్ కప్ ఫైనల్‌కు అతడే!

అర్జెంటీనాకు ఆ రిఫరీ అంటేనే దడ.. వరల్డ్ కప్ ఫైనల్‌కు అతడే!

FIFA World Cup Final: వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న అర్జెంటీనాను ఇప్పుడు ఒక సరికొత్త ఆందోళన వెంటాడుతోంది. అయితే ఈ భయం ప్రత్యర్థి స్పెయిన్ జట్టు గురించి కాదు, మ్యాచ్‌కు ప్రధాన రెఫరీగా వ్యవహరించనున్న స్లావ్కో విన్సిచ్ (Slavko Vincic) గురించి.. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు నిర్వాహకులు, రెఫరీలు అర్జెంటీనాకే అనుకూలంగా నిర్ణయాలు ఇస్తున్నారనే విమర్శలు నెట్టింట వస్తున్న తరుణంలో, ఫిఫా ఈ కీలక ఫైనల్ బాధ్యతను విన్సిచ్‌కు అప్పగించడం విశేషం.

స్లోవేనియా రెఫరీ బ్యాక్‌స్టోరీ: 
2010 నుంచి అంతర్జాతీయ రెఫరీగా సేవలందిస్తున్న 46 ఏళ్ల విన్సిచ్, స్లోవేనియా (Slovenia) దేశానికి చెందినవారు. అర్జెంటీనాకు ఇతనితో ఒక చేదు జ్ఞాపకం ముడిపడి ఉంది. 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, లీగ్ స్టేజ్‌లో సౌదీ అరేబియా చేతిలో 1–2 తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆ చారిత్రాత్మక మ్యాచ్‌కు రెఫరీగా ఉన్నది విన్సిచే.. ఆ మ్యాచ్‌లో తొలుత అర్జెంటీనాకు అనుకూలంగా పెనాల్టీ ఇచ్చినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో సౌదీ దూకుడుకు బ్రేక్ వేయలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అదే రెఫరీ ఫైనల్‌కు బాధ్యతలు చేపట్టడంతో మెస్సీ శిబిరాన్ని భయపెడతుంది. 

కన్నీళ్లు పెట్టుకున్న విన్సిచ్: 
ఇంతటి హై-ప్రొఫైల్ ఫైనల్ మ్యాచ్‌కు తనను రెఫరీగా ప్రకటించగానే విన్సిచ్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లను నడిపించిన ఆయన, ఒక మ్యాచ్‌లో ఈక్వెడార్ స్టార్ డిఫెండర్ పీరో హింకాపీకి రెడ్ కార్డు జారీ చేసి తన కఠినత్వాన్ని చాటుకున్నారు. మైదానంలో ఎమోషన్స్‌ను ఎక్కువగా చూపే అర్జెంటీనా ప్లేయర్స్ ఈ మ్యాచ్‌లో విన్సిచ్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం హద్దు దాటినా ఆయన అస్సలు ఉపేక్షించరని క్రీడా నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. 

ALSO READ : వరల్డ్ కప్ ఫైనల్ అంటే ఈ జట్లదే హవా.. 

స్పెయిన్‌తో ఉన్న పాత పరిచయం అర్జెంటీనాకు మైనస్: 
అర్జెంటీనాను కలవరపెడుతున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్పెయిన్ టీమ్ ఆడిన చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విన్సిచ్ రెఫరీగా వ్యవహరించిన సుదీర్ఘ అనుభవం ఉంది. దీంతో స్పెయిన్ ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్, వారి ఆటతీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ అడ్వాంటేజ్ ఫైనల్లో స్పెయిన్‌కు కలిసి వస్తుందని కొందరు భావిస్తున్నారు. మరి ఈ పాత సెంటిమెంట్స్, లెక్కలను బద్దలు కొట్టి మెస్సీ సేన వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలుస్తుంది.