పార్లమెంట్‌‌‌‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి ..ఓబీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

పార్లమెంట్‌‌‌‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి ..ఓబీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
  •  బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

కాచిగూడ, వెలుగు: ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, ఓబీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.

 కాచిగూడలోని జాతీయ బీసీ దళ్ హెడ్డాఫీసులో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్‌‌‌‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడారు. బీసీల వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలంటే జనాభా గణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌‌‌‌ను చేర్చి సమగ్ర కులగణన నిర్వహించడం అత్యవసరమన్నారు.

 దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యాదవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మందకాల మణి యాదవ్‌‌‌‌, వివిధ బీసీ, కుల సంఘాల లీడర్లు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.