- ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్
హైదరాబాద్, వెలుగు: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన రీ నీట్–2026లో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఆర్యన్ గుప్తా 1వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించాడు. అలాగే, గౌరవ్ సింగ్ 9వ ర్యాంక్, క్రిష్ గుప్తా 15వ ర్యాంక్, కార్తీక్ చౌదరి 16వ ర్యాంక్‌తో సంచలన విజయం అందుకున్నారు. వీటితో పాటు 22, 30, 31, 35, 39, 50, 56, 58, 71, 72, 76, 78, 79, 97 వంటి 100లోపు 18 ర్యాంకులు, 1,000లోపు 49 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1, 1, 2, 3, 3, 9, 9, 11, 12 వంటి 12లోపు 9 ర్యాంకులు, 100లోపు 45 ర్యాంకులు, 1,000లోపు 163 ర్యాంకులు సాధించి, సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్స్ సింధూర, శరణి మాట్లాడుతూ.. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించడం నారాయణ విద్యా సంస్థకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు వారు అభినందనలు తెలియజేశారు.
