న్యూఢిల్లీ: యూఎస్ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇండియాలో కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. మార్కెట్లోకి వచ్చి ఏడాది కావొస్తున్నా, కేవలం 450 బండ్లనే అమ్మింది. అంటే నెలకు 50 కంటే తక్కువ. గత జులైలో ఇండియాలోకి టెస్లా రాగా, సెప్టెంబర్ నుంచి 'మోడల్ వై' డెలివరీలను ప్రారంభించింది.
ఇదే కాలంలో బీఎండబ్ల్యూ 3,433 ఎలక్ట్రిక్ కార్లను, మెర్సిడెస్- బెంజ్ 1,116 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. టెస్లా ప్రస్తుతం భారత్‌లో కేవలం మోడల్ వైని మాత్రమే విక్రయిస్తోంది. ప్రత్యర్థి సంస్థలు విభిన్న మోడళ్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కార్లను దిగుమతి చేసుకోవడంతో -110శాతం సుంకం పడుతోంది. దీంతో ధర భారీగా పెరిగింది. ఈ ఏడాది మే నాటికి మోడల్ వై ధరను రూ. 50.89 లక్షలకు తగ్గించినా ఇది ఇంకా ప్రీమియం రేంజ్‌లోనే ఉంది.
