నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య హవా

నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య హవా

హైదరాబాద్, వెలుగు: నీట్-2026 ఫలితాల్లో తమ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్లు ఉత్తమ ర్యాంకులు సాధించారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్, 3వ, 9వ ర్యాంకులతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10 లో 8 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులవేనని వెల్లడించారు. ఆర్యన్ గుప్తా, ఉప్లాక్ష్య గోయల్, గౌరవ్ సింగ్, బురా సాయి శరణ్, కె.హనీష్ వంటి విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించారన్నారు. శ్రీచైతన్యకు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10లోపు 3 ర్యాంకులు, 20 లోపు 6 ర్యాంకులు, 50 లోపు 12 ర్యాంకులు, 100 లోపు 18 ర్యాంకులు,1000 లోపు 84 ర్యాంకులు వచ్చాయని వివరించారు. 

గతేడాదితో పోలిస్తే ఈసారి తమ సంస్థ నుంచి నీట్- అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 15 శాతం పెరిగిందన్నారు. ఇది శ్రీచైతన్య సంస్థల కోచింగ్ సామర్థ్యానికి నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు. నాణ్యమైన శిక్షణ, మైక్రోషెడ్యూల్స్, నిరంతర పరీక్షలు, దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ వల్లే  శ్రీచైతన్య సంస్థకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయన్నారు. నీట్-2027 నుంచి పరీక్షా సరళి మారుతున్న నేపథ్యంలో విద్యార్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం సిద్ధం చేస్తున్నామని సుష్మ వెల్లడించారు. నీట్-2026 ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను సుష్మ అభినందించారు.