వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారీఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్నుమూత

వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారీఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్నుమూత

బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బార్బడోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యుత్తమ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లలో ఒకరైన వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారీఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (89) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు లెజెండరీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరణాన్ని ఆయన కుమారుడు డేనియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధ్రువీకరించారు. మరో 10 రోజుల్లో 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉండగా, సోబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుదిశ్వాస విడవడం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

మార్చి 1954 నుండి ఏప్రిల్ 1974 మధ్య కాలంలో వెస్టిండీస్ జట్టు తరఫున 93 టెస్టులు ఆడారు. 57.78 సగటుతో 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో కలిపి 8,032 పరుగులు సాధించారు. లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ అయిన సోబర్స్.. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అదరగొట్టారు. లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియం పేస్, స్పిన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్ట్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 235 వికెట్లు పడగొట్టారు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడి, అందులో ఒక వికెట్ సాధించాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సర్ గ్యారీఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోబర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 1968లో నాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్ జట్టు తరఫున ఆడుతూ గ్లామోర్గాన్ బౌలర్ మాల్కమ్ నాష్ ఓవర్లో ఆయన ఈ ఘనత సాధించారు. సోబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మృతి పట్ల ఐసీసీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.