బుడాపెస్ట్ ర్యాకింగ్స్ టోర్నీలో హన్సికకు సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బుడాపెస్ట్ ర్యాకింగ్స్ టోర్నీలో హన్సికకు సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బుడాపెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హన్సిక లాంబా పొల్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమ్రే, వర్గా జానోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోజ్మా ఇస్తావాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెమోరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 55 కేజీల విభాగం ఫైనల్లో హన్సిక 0–5తో నటాలియా క్లివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. 

అంతకుముందు జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హన్సిక 10–7తో అనస్తాసియా బ్లేవాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)పై గెలిచి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. 65 కేజీల కాంస్య పతక పోరులో విశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాళీరామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8–2తో ఒస్సుమ్జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెక్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలవగా, 125 కేజీల్లో రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం లభించింది. గాయంతో మేసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా) బౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకున్నాడు.