నేడు (జూలై18) ఘట్‌‌కేసర్‌‌‌‌కు సీఎం రేవంత్రెడ్డి..

నేడు (జూలై18) ఘట్‌‌కేసర్‌‌‌‌కు సీఎం రేవంత్రెడ్డి..
  • రూ.3.95 కోట్లతో అందెశ్రీ  స్మృతి వనానికి శంకుస్థాపన 

 ఘట్‌‌కేసర్, వెలుగు: తెలంగాణ భాషా గౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా శనివారం ఘట్‌‌కేసర్‌‌లో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ఇందులో భాగంగా రూ.3.95 కోట్ల అంచనా వ్యయంతో ఘట్‌‌కేసర్‌‌లో నిర్మించనున్న ‘అందెశ్రీ స్మృతి వనం’కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను మేడ్చల్-మల్కాజ్‌‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేశ్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.