V6 News

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల: ఈ కింద లింక్స్ లో మార్కులు చెక్ చేసుకోండి..!

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల: ఈ కింద లింక్స్ లో మార్కులు చెక్ చేసుకోండి..!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఎదురు చూస్తున్న CBSE 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE ) 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 15న ప్రకటించింది. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు, తమ లాగిన్ వివరాలను ఉపయోగించి సీబీఎస్ ఈ అధికారిక వెబ్‌సైట్‌ లలో తమ ఫలితాలను పొందవచ్చు.  

ఫలితాలకోసం..

CBSE.gov.in
Results.nic.in
results.digilocker.gov.in
Umang.gov.in 

సీబీఎస్ ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17నుంచి  మార్చి 11 వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది బోర్డు పరీక్షలలో 10వ తరగతికి చెందిన దాదాపు 25 లక్షల మందితో సహా మొత్తం 43 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు.ఈ ఏడాది నుంచి రెండు సార్లు పదో తరగతి పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది.