స్కిన్ పై క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్..ఆమోదించిన కేంద్రం

స్కిన్ పై  క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్..ఆమోదించిన కేంద్రం

క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ కండ‌రాల నుంచి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే హైద‌రాబాద్ కు చెందిన ఫార్మా సంస్థ స్కిన్ నుంచి ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ అనుమ‌తి తీసుకుంది.

హైద‌రాబాద్ కు చెందిన ఫార్మా సంస్థ భార‌త్ బ‌యోటెక్ క‌రోనా వ్యాక్సిన్ ను త‌యారు చేసేందుకు ఐసీఎంఆర్ తో క‌లిసి ప‌నిచేస్తుంది. తాజాగా ఈ సంస్థ త‌యారు చేసిన క‌రోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ ను స్కిన్ పై ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించేందుకు సిడిస్కో అనుమ‌తి కోరిన‌ట్లు..అందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) కింద ఉన్న సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసి) ఆమోదించింది.

సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ ఔష‌ద నియంత్రణ సంస్థ‌. ఈ సంస్థ దేశంలోని మందులు, టీకాల నాణ్య‌త‌ను నియంత్రిస్తుంది. డ్రగ్స్ అండ్
కాస్మోటిక్స్ చట్టం ప్రకారం, డ్ర‌గ్స్ ఆమోదం, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం, వ్యాక్సిన్ల లైసెన్సులు మంజూరు చేయడం మరియు వాటికి ప్రమాణాలు ఇవ్వడం సిడిస్కో బాధ్యత.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం స్కిన్ ద్వారా వ్యాక్సిన్ ను ఇంజెక్ట్ చేయ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో ఇంట్రా డెర్మల్ టెక్నిక్ అని పిలుస్తారు. ఈ ఇంట్రా డెర్మల్ టెక్నిక్ ద్వారా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్ చేయ‌డం వ‌ల్ల ఖ‌ర్చు త‌గ్గిపోతుంద‌ని, అలాగే రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో కూడా మరింత ప్రభావవంతంగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.