రోడ్లపై గుంతలు పూడ్చాలని.. పూజలు

రోడ్లపై గుంతలు పూడ్చాలని.. పూజలు

బెంగళూరు: రోడ్ల గుంతలు అనేది ఇప్పుడు జనాలకు సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా అధికారులు మాత్రం రోడ్లను బాగు చేయడంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో తమ గోడును వెల్లడించడానికి జనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటిదే బెంగళూరు జనాలు కూడా ట్రై చేశారు. అక్కడి చార్లెస్ క్యాంప్‌‌బెల్‌‌ రోడ్‌‌లో భారతీనగర్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌ ఫోరం నివాసితులు కొత్త తరహాలో నిరసన తెలిపారు. రోడ్డుపై వరుసగా ఉన్న గుంతల్లో ఒక దానికి పూలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పూజారిని రప్పించి మరీ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.