పెరుగుతూ ఉన్న శివ లింగం.. ఆ నీళ్లు తాగితే రోగాలు నయం

పెరుగుతూ ఉన్న శివ లింగం.. ఆ నీళ్లు తాగితే రోగాలు నయం

కంప్యూటర్ యుగంలో  కూడా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఏదైనా కష్టం వస్తే ఆ గుడికి వెళ్లండి.. వీసా కావాలంటే చిలుకూరు బాలాజీని దర్శించుకోండి.. కోరుకున్న కోరిక తీరితే.. ఆ గుళ్లో మొక్కులు చెల్లిస్తాం.. ఈ గుడికి వస్తాం అని ప్రజలు అనుకుంటుంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. ఆ గుళ్లో నిద్ర చేయండి.. మరో గుళ్లో ప్రసాదం తినండి అంటూ  చెబుతుంటారు.  అయితే వీటికి నిదర్శనంగా ఓ శివాలయంలో నీరు తాగితే చర్మ వ్యాధులు మటు మాయం అవుతాయట.  ఇప్పుడు ఆ శివాలయం ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.  .

బీహార్ లోని  భోజ్‌పూర్ జిల్లాలోని అరా నగరంలో పురాతన శివాలయాల్లో బుద్వా మహాదేవ్  శివాలయం ఒకటి. ఇక్కడి శివలింగం ప్రతిసంవత్సరం పెరుగుతుందని అక్కడ పూజలు చేసే మహంతీ(అర్చకులు)చెబుతున్నారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది..ఈ స్వామిని దర్శించి తీర్థం తీసుకుంటే చర్యవ్యాధులు నయం అవుతాయనిభక్తులవిశ్వాసం.ఈ శివాలయం మహాభారత కాలం నాటిదని...పాండవులు వనవాస సమయంలో ఇక్కడ పూజలుచేశారని పురాణాలు చెబుతున్నాయి. ఖచ్చితమైన సమాచారం లేదు కాని.. రాజా భోజ్ కూడా ఇక్కడ పూజించాడని నమ్ముతారు. 

బుద్వా మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగం  పూర్వం చాలా చిన్నదిగా ఉండేదట. కానీ ప్రస్తుతం లింగం ఎత్తు 4 అడుగుల కంటే ఎక్కువగా ఉంది. ఆలయంలో శివలింగం పెరగడంపై  చర్చ జరుగుతోంది.  ప్రతిరోజూ వేలాది మంది శివ భక్తులు మహాదేవ్ అభిషేకం చేస్తారు. కానీ  శివరాత్రి రోజున, కార్తీక మాసంలో  అసంఖ్యాకమైన భక్తులు భోలే బాబాకు అభిషేకం చేయడానికి బుద్వా మహాదేవ్ వద్దకు వస్తారు.

నీరు తాగితే వ్యాధులు మాయం

బీహార్ లోని బుద్వా మహాదేవ్  శివాలయానికి చాలా గుర్తింపు ఉందని ప్రజలు నమ్ముతుంటారు.  పూర్వీకులు చాలా మంది ఇక్కడ మహంతులుగా (పూజారులుగా) ఉన్నారని ఆలయంలో ఉన్న పూజారి మహంత్ అజిత్ మిశ్రా చెప్పారు. తమ వంశస్థులు మొదటి నుండి బాబాకు సేవ చేస్తున్నామని మిశ్రా తెలిపారు. వారు ఇక్కడ పూజలు  చేస్తున్న దగ్గరి నుంచి శివలింగం ఎత్తు, మందం  పెరగడాన్ని గమనించామన్నారు. చర్మవ్యాధులు, తెల్లమచ్చలు ( తెల్లపొడ) ఉన్న వారు ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకం చేసి .. శివుడికి నివేదించిన నీటిని తీర్థంగా తీసుకొని ఆ నీరు శరీరంపై చల్లుకుంటే అలాంటి వ్యాధులనుంచి ప్రజలు కోలుకుంటారని  చెబుతున్నారు. 

వందలఏళ్ల నాటి శివాలయం

బీహర్ లోని బుద్వా మహాదేవ్ శివాలయం ఎప్పుడు, ఎవరు నిర్మించారో ఏ పురాణాల్లో కూడా  ఖచ్చితంగా  సమాచారం లేదు కాని.. ఇక్కడ ఉన్న శివలింగం తయారు  చేసిన రాయిని బట్టి మాత్రం పాండవుల వనవాసం చేసిన కాలంలోనిదని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.  అంతే కాదు మధ్యయుగంలో రాజభోజ్ కూడా ఇక్కడ శివుడిని పూజించారని స్థానిక పెద్దలు, పండితులు అంటున్నారు.