రాబోయే ఎన్నికల్లో ప్రధాని పదవిని ఆశించడం లేదు

రాబోయే ఎన్నికల్లో ప్రధాని పదవిని ఆశించడం లేదు

2024 సార్వత్రిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా విప‌క్షాలు ఏక‌తాటిపైకి రావాలంటూ త‌న‌కు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. విపక్షాలన్నీ ఏకం కావాలని, ఈ దిశ‌గా తాను ముందుకెళ్తున్నానని, అయితే ముందుగా బీహార్‌లో చక్కదిద్దాల్సివ‌ని ఎన్నో ఉన్నాయ‌ని తెలిపారు. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తాను ప్రధాని ప‌ద‌విని ఆశిస్తున్నానని వ‌స్తున్న వార్తల‌ను తోసిపుచ్చారు. ప్రధాని కావాలనే ఆలోచన త‌న‌కు లేద‌న్నారు. అంద‌రి కోసం ప‌ని చేయ‌డమే త‌న ప‌నని, విప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగ ప‌నిచేసేలా చూస్తాన‌ని చెప్పారు. విపక్షాలు ఐక్యంగా ముందుకెళితే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పారు. 

ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్‌జేడీ చీఫ్ తేజ‌స్వి యాద‌వ్ ప్రమాణం చేశారు.