పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధి శూన్యం..

పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధి శూన్యం..

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో ప్రచార ఆర్బాటం తప్పా అభివృద్ధి శూన్యం అని హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండపడ్డారు. ఇవాళ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారులు, కార్పొరేటర్లు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి నిధులు లేక డుమ్మా కొడుతున్నారని విమర్శించారు. గత పల్లె, పట్టణ ప్రగతితో ఏం అభివృద్ధి జరిగిందని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమం కోసం డిజివిన్, గ్రామాల వారీగా ఎన్ని నిధుల ఇచ్చారో చెప్పాలని పద్మ డిమాండ్ చేశారు.

పల్లె, పట్టణ ప్రగతి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. హన్మకొండ అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రం పథకాలు, కేంద్రం నిధులతోనే అని పద్మ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిధుల కోసం కేసీఆర్ నీ ఎందుకు ప్రశ్నిస్తాలేరని నిదీశారు. కమిషన్ల కోసమే టీఆర్ఎస్ పార్టీ అలోచిస్తుంది తప్ప అభివృద్ధి ఆలోచనే లేదన్నారు. బిల్లుల రాక అధికార పార్టీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో సర్పంచ్ లను మీటింగ్ పిలిచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖం చాటేశారని పద్మ ఎద్దేవ చేశారు.

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు లాక్కొని అప్పులు కట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. బండి సంజయ్ రైతుల పక్షాన దీక్ష చేస్తాననడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ వెంటనే రద్దు చేశారు. మాటలకు, పేపర్ల ప్రకటనల కోసమే టీఆర్ఎస్ నేతలు పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నారని రావు పద్మ దుయ్యబట్టారు.