Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్

Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్

ఏ ఇండస్ట్రీలో అయినా విజయాలు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ, పాపం పాయల్ రాజ్ పుత్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అసలు విషయం ఏంటంటే.. పాయల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఏ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత సక్సెస్ ట్రాక్ ఎక్కింది బోల్డ్ బ్యూటీ పాయల్. ఆర్ఎక్స్ 100 తరువాత ఒక్క హిట్టు కూడా లేని ఆమెకు మంగళవారం మంచి విజయాన్ని సాధించింది. 

అయితే.. ఈ చిత్రం విజయం సాధించడంతో ఆమె గత సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలా వస్తున్న మూవీ రక్షణ. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దమయ్యింది. అయితే ఈ సినిమా విడుదల విషయం కొత్త వివాదం నెలకొంది. అదేంటంటే.. రక్షణ సినిమా ప్రమోషన్స్ కి రాకపోతే ఆమెను తెలుగు ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారట మేకర్స్. తాజాగా ఈ విషయంపై స్పందించారు హీరోయిన్ పాయల్ రాజ్పుత్. 

2019-20 సమయంలో రక్షణ అనే సినిమా ఒప్పకున్నాను. దానికి ముందు 5Ws టైటిల్‌ అనుకున్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. రీసెంట్‌గా నేను నటించిన మంగళవారం సినిమా హిట్ అవడంతో రక్షణ సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం నా రెమ్యునరేషన్‌ ఇవ్వకుండానే ప్రమోషన్స్ కి రావాలని ఒత్తిడి తెస్తున్నారు. రాకపోతే తెలుగు సపినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయంలో నా టీమ్‌ ఇప్పటికే మేకర్స్ ని సంప్రదించింది. అయినప్పటికీ.. వారు నా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధం.. అంటూ చెప్పుకొచ్చింది పాయల్.