వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  క్షేత్రనికి పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు : వేసవి, సెలవురోజు కావడంతో దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.  రాష్ర్టంతో పాటు పక్క రాష్ర్టాలైనా అంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర  నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయమే స్వామివారి కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి  ధర్మగుండంలో స్నానం అచరించి క్యూలైన్​ లో వేచియున్నారు.

  సుమారు నాలుగు గంటల పాటు క్యూలైన్​ లో వేచి యుండి    లక్ష్మీ గణపతి స్వామివారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, రాజరాజేశ్వర దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే స్వామి వారి వాహానంగా పిలువబడే కోడెను కోరిన కోర్కెలు తీరాలని కుటుంబ సభ్యులతో కలిసి కోడె మొక్కు చెల్లించారు. మరో వైపు స్వామి వారి ప్రసాదం కౌంటర్​, కోడెల టికెట్​ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. అటూ అనుబంధ ఆలయమైనా భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.