కరీంనగర్ టౌన్,వెలుగు: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు గురువారం నిర్వహించిన సమ్మెలో కార్మికులు కదం తొక్కారు. కరీంనగర్‌లో ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐఐఈఏ), ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్(ఐసీఈయూ) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్, గీతాభవన్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు, మంచిర్యాల చౌరస్తా నుంచి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, వీబీ జీ రామ్‌జీ చట్టం, విద్యుత్, విత్తన బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల లీడర్లు బండారి శేఖర్, ఎ.రామ్మోహన్ రావు, బుచ్చన్నయాదవ్, టేకుమట్ల సమ్మయ్య, జిందం ప్రసాద్, గజ్జెల శ్రీకాంత్, గీట్ల ముకుందరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమ, శ్రీనివాస్ రెడ్డి, దావు రాజ మల్లయ్య, పొన్నం లింగయ్య, బండారి సంపత్, కె.అరవింద్ పాల్గొన్నారు.
మంథని/గన్నేరువరం, వెలుగు: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మంథని, ముత్తారం మండలాల్లో కార్మికులు నిరసన చేపట్టారు. ర్యాలీగా ప్రదర్శనతో తహసీల్దార్ ఆఫీస్‌లో వినతి పత్రం అందజేశారు. లీడర్లు ఆర్ల సందీప్, సురేశ్, మల్లేశ్, చందు, గట్టయ్య, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. గన్నేరువరం మండలకేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. బస్టాండ్ చౌరస్తా నుంచి తహసీల్ ఆఫీస్‌కు వరకు ర్యాలీ నిర్వహించారు. లీడర్లు చొక్కల శ్రీశైలం, కాంతల అంజిరెడ్డి, వివిధ సంఘాల నాయకులు
పాల్గొన్నారు.
