V6 News

ఖమ్మంలో సత్తెనపల్లి భవన్ ప్రారంభం

ఖమ్మంలో సత్తెనపల్లి భవన్ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని ఇందిరానగర్ చౌరస్తాలో పోరాట యోధుడు  సత్తెనపల్లి రామకృష్ణ పేరుతో నూతనంగా నిర్మించిన సత్తెనపల్లి భవన్ ను ఆదివారం కేరళ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కలిసి ప్రారంభించారు. పార్టీ వాలంటీర్లు రెడ్ షర్ట్ కవాతు నిర్వహించి భారీ ప్రదర్శన చేపట్టారు.

అనంతరం నూతన భవన్ లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, బి.వెంకట్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కళ్యాణ వెంకటేశ్వర్లు, వై.విక్రం, భూక్య వీరభద్రం, ఎర్ర శ్రీనివాసరావు, బుగ్గవీటి సరళ, దొంగల తిరుపతిరావు, హవేలీ సీపీఎం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.