వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సాయంత్రం బేడా మండపంలో కల్యాణ క్రతువును అర్చకులు పూర్తి  చేశారు. ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పించడంతో కల్యాణ క్రతువు ముగిసింది.

ఉదయం గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామికి పంచామృత అభిషేకం చేసి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. భక్తులకు అభిషేక జలాలు, మంజీరాలు పంపిణీ చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. వీకెండ్​ కావడంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. క్యూలైన్లు, ఉత్తరద్వారం వైపు భక్తులు అధిక సంఖ్యలో దర్శనం కోసం వేచి చూశారు.